అప్పుడు అజయ్... ఇప్పుడు ప్రియాంక..! | Priyanka Chopra to turn cop for Prakash Jha's 'Gangaajal 2' | Sakshi
Sakshi News home page

అప్పుడు అజయ్... ఇప్పుడు ప్రియాంక..!

Jan 3 2015 10:50 PM | Updated on Apr 3 2019 6:23 PM

అప్పుడు అజయ్... ఇప్పుడు ప్రియాంక..! - Sakshi

అప్పుడు అజయ్... ఇప్పుడు ప్రియాంక..!

గంగాజల్’ వంటి రాజకీయ నేపథ్య సినిమాలు తీయాలంటే - అది ప్రకాశ్ ఝా ఒక్కరికే సాధ్యమని బాలీవుడ్‌లో అంటారు.

 ‘గంగాజల్’ వంటి రాజకీయ నేపథ్య సినిమాలు తీయాలంటే - అది ప్రకాశ్ ఝా ఒక్కరికే సాధ్యమని బాలీవుడ్‌లో అంటారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం అజయ్ దేవగణ్ హీరోగా ఆయన రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయాలని ప్రకాశ్ ఝా అనుకుంటున్నారు. అయితే ఈ సీక్వెల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. పాత చిత్రంలో అజయ్ దేవగణ్ చేసిన పోలీస్ అధికారి పాత్రను తాజా చిత్రంలో ప్రియాంకా చోప్రా చేయనున్నారు.
 
  శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా ఒదిగిపోవడానికి ప్రియాంక కసరత్తులు చేస్తున్నారట. మొన్నా మధ్య వరకు మేరీ కోమ్ పాత్ర కోసం కఠోర శమ్ర చేశారామె. ప్రస్తుతం చేస్తున్న ‘దిల్ ధడక్నే దో’ కోసం శరీరాకృతి మార్చుకున్నారు. ఈ చిత్రం పూర్తయ్యే సమయానికి తదుపరి చిత్రం కోసం శారీరక భాష మార్చుకోవాలనుకుంటున్నారు. మొత్తం మీద రెండేళ్లుగా ప్రియాక ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారన్న మాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement