ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

Priyanka Chopra Smokes on Yacht in Miami - Sakshi

‘కోడలికి నీతుల చెప్పి అత్త ఏదో చేసిందంట’ అన్నట్లు ఉంది బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తీరు. ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. దీపావళిని దీపాలతో జరుపుకోవాలి కానీ.. పటాసులు కాల్చి కాలుష్యానికి కారణం కావద్దు’ అంటూ నీతులు చెప్పిన ఈ బాలీవుడ్‌ బామ ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది.

జులై 18న జన్మదినం జరుపుకున్న ప్రియాంక.. భర్త నిక్‌ జోనస్‌తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఫ్లొరిడాలోని మయామిలో ప్రియానిక్‌ జోడి సేద తీరుతుండగా.. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా వారితోనే ఉన్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురు కలిసి ధూమాపానం చేస్తున్న ఓ ఫొటో నెట్టింట హల్‌చేస్తోంది. ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా సిగరేట్‌ను ఆస్వాదిస్తుంది. ఇక ఈ ఫొటోను చూసిన అభిమానులు.. ఒక్కసారిగా ఆమె గతంలో చెప్పిన నీతులని ప్రస్తావిస్తూ.. ‘అప్పుడు ఏం చెప్పి.. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి’  అంటూ సెటైరిక్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. సిగరేట్‌ కాల్చిన ఫొటోలతో మీమ్స్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా ఆస్తమ రోగులకు అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లప్పుడు తాను ఆస్తమ వ్యాధితో బాధపడ్డానని, ఆ వ్యాధి తన కలలకు అడ్డుగా నిలవలేదని ఆస్తమ వ్యాధిగ్రస్తులను చైతన్య పరిచే వ్యాఖ్యలు చేశారు. ఆస్తమా రోగులు ఈ ఫొటో చూడొద్దంటూ నెటిజన్లు సెటైర్లేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top