ప్రియాంకకు షాకిచ్చిన నిర్మాతలు!

Priyanka Chopra Film with Chris Pratt Cowboy Ninja Viking Is Postponed - Sakshi

గత కొంత కాలంగా రోజుకో రకం వార్తలతో హాట్‌ టాపిక్‌గా మారారు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్‌ కోసమే సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ సినిమా నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సోనాలీ బోస్‌ ‘ద స్కై ఈజ్‌ పింక్‌’  సినిమా షూటింగ్‌ మొదలు పెట్టారు పిగ్గీ చాప్స్‌. అయితే హాలీవుడ్‌ మూవీ ‘కౌబాయ్‌ నింజా వికింగ్‌’లో నటించడం కోసమే ప్రియాంక భారత్‌ సినిమాను వదులుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కౌబాయ్‌ నింజా వికింగ్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రియాంకకు షాక్‌ ఇచ్చారు నిర్మాతలు.

హాలీవుడ్‌ ఎంటర్టేన్‌మెంట్‌ పోర్టల్‌ కథనం ప్రకారం.. కౌబాయ్‌ నింజా వికింగ్‌ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ప్రొడక్షన్‌ షెడ్యూలింగ్‌ ఇష్యూ కారణంగా 2019లో కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ‘ప్రస్తుతానికైతే డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో క్రిస్‌ ప్రాట్‌తో ప్రియాంక కూడా నటిస్తారు. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది కచ్చితంగా చెప్పలేమని* కౌబాయ్‌ నింజా వికింగ్ నిర్మాతలు పేర్కొన్నారు. కాగా హాలీవుడ్‌ సినిమాను నమ్ముకుని.. భారత్‌ సినిమా నుంచి ప్రియాంక తప్పుకోవడంతో ఆ అవకాశం కత్రినాను వరించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top