ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్! | Prakash Raj miraculous escape as a bus rammed into car | Sakshi
Sakshi News home page

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్!

Aug 13 2014 2:51 AM | Updated on Aug 30 2018 3:58 PM

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్! - Sakshi

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్!

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సు వేగంగా వచ్చి ప్రకాశ్ రాజ్ ప్రయాణిస్తున్న కారును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. ఓ ఆటో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ ఘటన హైటెక్ సిటీలోని సైబర్ టవర్ కు సమీపంలోని మాదాపూర్ ఫ్లై ఓవర్ వద్ద జరిగింది.
 
ప్రమాదం కంటే అతి బాధించిన విషయం ఏమిటంటే గాయపడిన బాధితులను పట్టించుకోకుండా కొందరు యువకులు సెల్ ఫోన్ తో ఫోటోలు తీసుకోవడం బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి చాలా సిగ్గుతో తలవంచుకున్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించే మనుషులను చూసి విపరీతంగా భయమేసింది. 
 
నా ప్రాణాల మీద భయం కంటే మనుషుల ప్రవర్తన పట్ల భయమనిపించింది. మనం ఎక్కడికి పోతున్నాం. నా సహాయం చేసే స్థితిలో లేనందుకు నన్ను నేనే నిందించుకోవాల్సి వచ్చింది అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement