రికార్డులు సైతం ‘సాహో’ అనాల్సిందే!

Prabhas Saaho Teaser Views In a Day Is 60 Millions - Sakshi

ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం సాహో టీజర్‌తో వచ్చేసింది. గురువారం విడుదల చేసిన ఈ టీజర్‌ను చూసి.. ఎంతగానో సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్‌. అసలే ప్రభాస్‌ బాహుబలి తరువాత బిగ్‌స్క్రీన్‌పై కనిపించక చాలా రోజులు అయ్యేసరికి అభిమానులు ఆకలితో ఉన్నారు. ఒక్కసారిగా వారి ఎదురుచూపులన్నీ సాహో టీజర్‌తో తీరిపోయాయి. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న ఈ టీజర్‌.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఈ టీజర్‌ రిలీజ్‌ అయినప్పటినుంచి రికార్డుల వేటను కొనసాగిస్తూ.. విడుదలైన ఒక్క రోజుల్లోనే 60మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్‌, ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top