ఎట్టకేలకు ప్రభాస్‌ స్పందించాడు

Prabhas Reacted on Marriage Rumours - Sakshi

బాహుబలి సిరీస్‌తో రేంజ్‌ పెరిగాక యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వివాహం గురించి నేషనల్‌ మీడియా కూడా తెగ ఆసక్తికనబరుస్తోంది. గత కొన్నేళ్లుగా వివాహాన్ని వాయిదా వేసుకుంటూ సినిమాలతో బిజీ అయిపోయిన డార్లింగ్‌.. కనీసం ఈ ఏడాదైనా చేసుకుంటాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకానోకదశలో హద్దులు దాటి ఏకంగా అనుష్క శెట్టితోనే ప్రభాస్‌ వివాహం అంటూ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ‘తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే’ అంటూ అనుష్క ఆ వార్తలను సింపుల్‌గా తోసిపుచ్చారు. అయినప్పటికీ కొందరు ఆ పుకార్లను కొనసాగిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఆ వార్తలపై స్పందించటం ప్రభాస్‌ వంతు అయ్యింది. ‘వివాహం అన్నది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. దాని గురించి ఏం మాట్లాడదల్చుకోలేదు. ఆ ముహూర్తం వచ్చినప్పుడు ఖచ్ఛితంగా నా అభిమానులకు నేనే చెబుతా’ అని ప్రభాస్‌ సమాధానమిచ్చాడు. ఓ మాగ్జైన్‌ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇండియాటుడే కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ సుజిత్‌ డైరెక్షన్‌లో నటిస్తున్న సాహో షూటింగ్‌ జరుపుకుంటోంది. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ఇందులో హీరోయిన్‌ కాగా, వచ్చే ఏడాది చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top