పవన్ మరో సినిమా మొదలెడుతున్నాడు..! | Pawan, Santhosh Srinivas Movie Starts from December | Sakshi
Sakshi News home page

పవన్ మరో సినిమా మొదలెడుతున్నాడు..!

Oct 15 2017 1:11 PM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Santhosh Srinivas - Sakshi

రాజకీయాల్లో బిజీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాకు గుడ్ బై చెప్పబోతున్నాడన్న వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్ కు అదే ఆఖరి సినిమా అన్న టాక్ కూడా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలో పవన్ మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించే అవకాశాలు ఉన్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాను డిసెంబర్ లో ప్రారంభించాలని భావిస్తున్నారట. తమిళ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో పవన్ చేయాల్సిన సినిమా కూడా లైన్ లో ఉంది. వీటిలో పవన్ ఏ సినిమాను ముందు చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement