
నిర్మాతగా రెండోసారి!
కథానాయికగా మంచి స్థానంలో ఉన్న అనుష్కా శర్మ నిర్మాతగా మారి, ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’...
కథానాయికగా మంచి స్థానంలో ఉన్న అనుష్కా శర్మ నిర్మాతగా మారి, ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ పతాకంపై రూపొందించిన ‘ఎన్‌హెచ్ 10’ అందరి కితాబులూ అందుకున్న విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి ప్రయత్నం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆమె మలి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండు చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేశారు. వాటిలో ఒక చిత్రంలో తానే కథానాయికగా నటించనున్నారు.
నూతన దర్శకుడు అన్షాయ్ లాల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందునుంది. పంజాబ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ని ఎక్కువ శాతం అక్కడే జరపాలనుకుంటున్నారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు.