డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

New Digital Service Provider Demo To Prevent Piracy Launched At AMB Cinemas - Sakshi

– సి. కళ్యాణ్‌

‘‘డీ సినిమాను అందరూ ప్రోత్సహించాలి. నిర్మాతల కష్టాన్ని పైరసీ ద్వారా వృథా చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ‘డీ’ సినిమా సేవలు రానున్నాయి. బసిరెడ్డిగారు ఈ టెక్నాలజీ తీసుకురావడం సంతోషం’’ అన్నారు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌. పైరసీని అరికట్టడానికి ‘డీ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌’ డెమోను ఏఎంబీ సినిమాస్‌లో ప్రారంభించారు. ‘డిజిక్వెస్ట్‌’ ఇండియా లిమిటెడ్‌ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ– ‘‘పైరసీ నిర్మూలన కోసం రెండేళ్లు ట్రై చేశాం. కొత్త టెక్నాలజీలో పైరసీ ప్రొటక్షన్‌ ఇమిడి ఉండటం విశేషం.

తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కామర్స్, డిజిక్విస్ట్‌ ఇండియా సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళతారు’’ అన్నారు.తెలంగాణ ఎఫ్‌.డి.సి. చైర్మన్‌ పి.రామ్మోహన్‌ రావ్‌ మాట్లాడుతూ– ‘‘పైరసీని అరికట్టడానికి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. డిజిటల్‌ డెలివరీ రేట్స్‌ నిర్మాతలందరికీ అందుబాటులో ఉండేలా  ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీలోని వారందరూ దీనికి సపోర్ట్‌ చేస్తున్నారు’’ అన్నారు. తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ కె.మురళీ మోహన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ వడ్లపట్ల, తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ  సునీల్‌ నారంగ్, జాయింట్‌ సెక్రటరీ బాల గోవింద్‌ మూర్తి, తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్, దర్శకుడు వీర శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top