ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య | Naga Chaitanya Requests Sai Pallavi Dont Call Me Garu | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య

Nov 24 2019 7:15 PM | Updated on Nov 24 2019 7:23 PM

Naga Chaitanya Requests Sai Pallavi Dont Call Me Garu - Sakshi

హీరో నాగచైతన్య జన్మదినం(నవంబర్‌ 23) పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వారికి నాగచైతన్య నేడు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్‌ సాయి పల్లవి కూడా చైతూకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మంచి మనసు, స్వచ్చమైన నవ్వు కలిగిన చైతన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. దీనికి బదులుగా సాయి పల్లవికి కృతజ్ఞతలు తెలిపిన చైతూ.. ‘దయచేసి గారు అని అనకండి.. మీరు అలా పిలిచి నా వయసు చాలా పెద్దదని అనుకునేలా చేశార’ని తెలిపారు.

అలాగే తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తన భార్య సమంతకు కూడా చైతూ కృతజ్ఞతలు తెలిపారు. థాంక్యూ మై లవ్‌ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి, నాగచైతన్య కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement