
జీవితంలో అన్ని సంఘటనలు జ్ఞాపకాలు కాలేవు. కానీ ప్రేమ విషయంలో ప్రతీది జ్ఞాపకమే అవుతుంది. మరి ఆ జ్ఞాపకాలు తీపివా? చేదువా అంటే? ‘తేరీ యాద్’ (నీ జ్ఞాపకాలు అని అర్థం) చూడాలంటున్నారు మోహిత్ సూరి. ‘ఆషికీ 2, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ వంటి లవ్ స్టోరీలు తెరకెక్కించిన మోహిత్ తన తదుపరి సినిమాకు ‘తేరీ యాద్’ టైటిల్‌ను ఫిక్స్ చేశామని అనౌన్స్ చేశారు.
‘ఆషికీ 2, ఏక్ విలన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ సినిమాల హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనున్నట్టు సమాచారం.