మెగా హీరో టైటిల్‌ ‘జాలరి’ కాదు.. ఉప్పెన!

Mega Hero Vaishnav Tej Movie Title Uppena - Sakshi

మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదకు వచ్చింది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top