భరత్ఃఅసెంబ్లీ | Mahesh Babu's Bharath Ane Nenu shoot at Assembly set at hyderabad | Sakshi
Sakshi News home page

భరత్ఃఅసెంబ్లీ

Sep 18 2017 1:19 AM | Updated on May 10 2018 12:13 PM

భరత్ఃఅసెంబ్లీ - Sakshi

భరత్ఃఅసెంబ్లీ

అసెంబ్లీకి వెళ్లడం మహేశ్‌బాబుకు కొత్తే.

అసెంబ్లీకి వెళ్లడం మహేశ్‌బాబుకు కొత్తే. కానీ, ఎక్కడా అసెంబ్లీకి తాను కొత్త అన్నట్లు కాకుండా చలాకీగా దూసుకెళ్తున్నారట. ఎంతైనా... సూపర్‌స్టార్‌ కదా! ఏ సీన్‌ పేపర్‌ ఇచ్చినా చకచకా చేసేస్తున్నారట! తనను తాను రాజకీయ నాయకుడిగా ఊహించుకుంటున్నారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘భరత్‌ అనే నేను’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో భారీగా వేసిన అసెంబ్లీ సెట్‌లో జరుగుతోంది.

మహేశ్‌ మరియు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నటీనటుల పనేంటి? దర్శకుడు చెప్పిన పాత్రల్లో తమను తాము ఊహించుకుంటూ, వాటిలో ఒదిగిపోయి నటించడమే కదా! మహేశ్‌ ఇప్పుడు చేస్తున్నదదే. ‘స్పైడర్‌’లోని ‘స్పై’ క్యారెక్టర్‌ నుంచి బయటకొచ్చి, ‘భరత్‌ అనే నేను’లోని రాజకీయ నాయకుడిగా మారారు. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్టు సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బీటౌన్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరకర్త. దసరా కానుకగా ఈ నెల 27న ‘స్పైడర్‌’ విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement