మాఫియా డాన్ ప్రేమకథ

మాఫియా డాన్ ప్రేమకథ


 ఓ అనాథ శరణాలయంలో సేవలందించే ఆమె, ఓ మాఫియా డాన్‌తో ప్రేమలో పడుతుంది. అయితే తాను ప్రేమిస్తున్నది ఓ మాఫియా డాన్‌ని అని ఆ అమ్మాయికి తెలియదు. ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘తేజాభాయ్’. పృథ్వీరాజ్, అఖిల జంటగా సుమన్, తలైవాసల్ విజయ్ కీలక పాత్రల్లో కరుణాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఎం. రంగారెడ్డి, ఎస్. రామచంద్రారెడ్డి     ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మాటలు: మల్లూరి వెంకట్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top