 
													సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా నుంచి రెండో పాట ‘ఎందుకు?’ను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. తొలి పాట ‘వెన్నుపోటు’తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ, రెండో పాటలో ఎలాంటి వివాదాలకు తెర తీస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ పాటకు సంబంధించిన టీజర్‌లోనూ వర్మ మరో బాంబు పేల్చబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ‘ఈ పాటలోని ప్రశ్నల వెనుక అబద్దాలుగా చెలామణీ అవుతున్న నిజాలను, నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలని బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ధ్యేయం’ అంటూ వర్మ మాటలతో రిలీజ్ చేసిన టీజర్‌లో జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి వారందరినీ వదలి ఆ లక్ష్మీ పార్వతిని ఎందుకు..? అనే లిరిక్స్‌తో పాట కాన్సెప్ట్‌ను కూడా రివీల్ చేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా ఆ సినిమాలో చూపించని ఎన్నో నిజాలు తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతమందిస్తున్నారు.
Here’s a teaser trailer of Endhuku ? Song from #LakshmisNTR ..Full song releasing today at 5 PM pic.twitter.com/WctXXLNbpK
— Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2019

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
