స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌ | Kiara Advani Says No To Vijay, Lokesh Kanagaraj Movie | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

Sep 12 2019 9:59 AM | Updated on Sep 12 2019 9:59 AM

Kiara Advani Says No To Vijay, Lokesh Kanagaraj Movie - Sakshi

సౌత్‌లో స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల కొరత బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సరసన నటించే హీరోయిన్లు ఆ ప్రాజెక్ట్‌లను నుంచి తప్పుకున్న వార్తలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌కు కూడా ఇదే సమస్య ఎదురైంది. ప్రస్తుతం బిగిల్‌ సినిమాలో నటిస్తున్న విజయ్‌, ఆ సినిమా తరువాత లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్‌ను ఫైనల్‌ చేయటం సమస్యగా మారిందట. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్‌గా రష్మిక మందన్నను తీసుకున్నారు. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవటంతో రష్మిక ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. తరువాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని భావించారు. కానీ కియారా కూడా డేట్స్‌ సమస్య కారణంగానే విజయ్‌ సినిమాకు నో చెప్పేశారట. దీంతో మరోసారి హీరోయిన్‌ వేటలో పడ్డారు విజయ్‌ చిత్ర యూనిట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement