ఆ వీడియో.. బాలనటికి కష్టాలు | Kerala Child Actor Drives Car in FB Video | Sakshi
Sakshi News home page

ఆ వీడియో.. బాలనటికి కష్టాలు

Mar 31 2018 12:47 PM | Updated on Sep 29 2018 5:26 PM

Kerala Child Actor Drives Car in FB Video - Sakshi

త్రివేండ్రం, కేరళ : సినిమా ప్రమోషన్ల కోసం ప్రస్తుతం అందరూ సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. మలయాళ బాలనటి మీనాక్షి(12) కూడా తన క్యారెక్టర్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ఆ పోస్టు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 1.1 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో 2255 అనే నంబర్‌ ప్లేటు గల కారును నడుపుతున్న మీనాక్షి ఒక చోట ఆగి.. మోహన్‌లాల్‌ ఫేమస్‌ డైలాగ్‌ ‘ నా ఫోన్‌ నంబర్‌ 2255’ అంటూ ఆయన్ని అనుకరించేందుకు ప్రయత్నించారు.

సుమారు ఒక లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. వీరిలో కొందరు మీనాక్షిని మెచ్చుకోగా.. చాలా మంది మాత్రం నువ్వు చేసింది కరెక్ట్‌ కాదంటూ కామెంట్‌ చేశారు. ‘నువ్వు మైనర్‌వి. ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయడం వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ’ కొందరు సలహా ఇవ్వగా... ‘ఇలాంటి వీడియోలు ఇంకెప్పుడూ పోస్ట్‌ చేయకు.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఇలా చేయడమేమిటి’  అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

‘రోడ్లపైనైనా ప్రైవేట్‌ లాండ్‌లోనైనా లైసెన్స్‌ లేకుండా కారు నడపడం నేరమంటూ.. మైనర్‌ కారు నడుపుతున్న వీడియోను ఎలా పోస్ట్‌ చేస్తారు. అయినా మీరెలా చట్టం నుంచి తప్పించుకోగలిగారని’ మరొకరు కామెంట్‌ చేశారు. దీంతో కంగుతిన్న మీనాక్షి వివరణ ఇచ్చారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన  ‘మోహన్‌లాల్‌’ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. గతంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ఒప్పం (తెలుగులో కనుపాప) సినిమాలో బాలనటిగా కనిపించిన మీనాక్షి ప్రస్తుతం మోహన్‌ లాల్‌ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement