మలయాళ సినిమా రచయిత కన్నుమూత | Kerala bids farewell to well known script writer TA Razzaq | Sakshi
Sakshi News home page

మలయాళ సినిమా రచయిత కన్నుమూత

Aug 16 2016 2:17 PM | Updated on Sep 4 2017 9:31 AM

మలయాళ సినిమా రచయిత కన్నుమూత

మలయాళ సినిమా రచయిత కన్నుమూత

ప్రముఖ మలయాళ సినిమా కథా రచయిత టీఏ రజాక్ అంత్యక్రియలు నేడు ముగిశాయి.

కొండోటి: ప్రముఖ మలయాళ సినిమా కథా రచయిత టీఏ రజాక్ అంత్యక్రియలు నేడు ముగిశాయి. మలప్పురం జిల్లాలోని కొండోటిలో అధికార లాంఛనాలతో ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. 58 ఏళ్ల రజాక్ అనారోగ్యంతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు. సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయన కడసారి వీడ్కోలు పలికారు. అంతకుముందు కోజికోడ్ లో రజాక్ మృతదేహానికి సినీ ప్రముఖులు మమ్మట్టి, మనోజ్ కె జయన్, దర్శకులు కమల, శిబి మలయాయిల్ తదితరులు శ్రధ్ధాంజలి ఘటించారు.

1991లో మోహన్ లాల్, ఊర్వశి జంటగా నటించిన 'విష్ణులోకం'తో కెరీర్ ప్రారంభించిన రజాక్ 30పైగా సినిమాలకు పనిచేశారు. స్క్రిప్ట్, కథ, మాటలు అందించారు. కేరళ ప్రభుత్వ అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది విడుదలైన 'సుఖమైరుకథే' ఆయన పనిచేసిన చివరి సినిమా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement