కొడుకులా మాట్లాడుతూ మురిసిపోతున్న కరీనా! | Kareena Kapoor Khan Imitates Her Son Taimur Ali Khan | Sakshi
Sakshi News home page

కొడుకులా మాట్లాడుతూ మురిసిపోతున్న కరీనా!

Sep 20 2019 6:13 PM | Updated on Sep 20 2019 7:44 PM

Kareena Kapoor Khan Imitates Her Son Taimur Ali Khan - Sakshi

సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలు చేసే అల్లరి పనులు, ముద్దు మాటలను చూసి మురిసిపోతుంటారు. అలాగే వారు చేసే అల్లరి చేష్టల గురించి బంధువులకు, స్నేహితులకు చెబుతూ తెగ సంబర పడిపోతుంటారు. అలాగే బాలీవుడ్‌​ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా తన కుమారుడు తైమూర్‌ అల్లరి, ముద్దు ముద్దు ముచ్చట్ల గురించి చెబుతూ మురిసిపోతోంది. తాజాగా కరీనా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తైమూర్‌ గురించి అడగ్గానే కరీనా అనందపడిపోతూ.. తైమూర్‌ అల్లరి గురించి ఇలా చెప్పుకొచ్చారు. తైమూర్‌లా మాట్లాడుతూ (కిడ్‌ వాయిస్‌)తో ‘అబ్బా కిదర్‌ హై.. అబ్బా కిదర్‌ హై’ అంటూ రోజులో ఒక పదిసార్లు అడుగుతుంటాడని, అప్పుడు నేను.. నాన్న బాత్‌ రూంలో ఉన్నాడు బేటా అని చెప్పి తైమూర్‌ ప్రశ్నలకు పుల్‌స్టాప్‌ పెడతానంటూ చెప్పుకొచ్చారు.

కాగా కరీనా ఇటీవలె ఇర్ఫాన్‌ ఖాన్‌తో నటిస్తున్న ఆంగ్రేజి మీడియం సినిమా షూటింగ్‌ను లండన్‌లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అక్షయ్‌తో చేస్తున్న గుడ్‌ న్యూస్‌ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓ టీవీ షోలో నటిస్తూ బిజీగా ఉన్న కరీనా.. ఏడాది తర్వాత కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తఖ్త్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఇందులో కరీనాతో పాటు మరో స్టార్‌ హీరో, హీరోయిన్‌ అలియా భట్‌, అనిల్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌లు కూడా నటించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌, భూమి ఫడ్నేకర్‌ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement