అది ముగిసిపోయిన అధ్యాయం! | Kangana Ranaut in awe of 'fiery' 'Rangoon' character! | Sakshi
Sakshi News home page

అది ముగిసిపోయిన అధ్యాయం!

Jan 31 2016 11:47 PM | Updated on Aug 17 2018 5:11 PM

అది ముగిసిపోయిన అధ్యాయం! - Sakshi

అది ముగిసిపోయిన అధ్యాయం!

‘‘నా జీవితం నా ఇష్టం. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ముగిసిపోయిన విషయం అయినా, జరుగుతున్నది అయినా’’ అని కంగనా రనౌత్ ఒకింత ఘాటుగా స్పందించారు.

‘‘నా జీవితం నా ఇష్టం. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ముగిసిపోయిన విషయం అయినా, జరుగుతున్నది అయినా’’ అని కంగనా రనౌత్ ఒకింత ఘాటుగా స్పందించారు. బోల్డ్‌గా మాట్లాడే ఈ బ్యూటీ ఇప్పుడిలా అనడానికి కారణం ఆమెకూ, హృతిక్ రోషన్‌కూ మధ్య ఎఫైర్ సాగుతోందనే వార్త రావడమే. ‘కైట్స్’ చిత్రం అప్పుడు ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారనే వార్త వచ్చింది. ఆ చిత్రం విడుదలైన ఆరేళ్లకు మళ్లీ ఈ వార్త ఫ్రెష్‌గా మొదలైంది. దానికి కారణం ఏడాదిన్నర క్రితం హృతిక్, అతని భార్య సుజానె విడాకులు తీసుకోవడమే.

భార్య నుంచి విడిపోయాక మళ్లీ కంగనాతో పాత ప్రేమను హృతిక్ మొదలుపెట్టాడని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఈ వార్తను మౌనంగా భరించిన హృతిక్ హఠాత్తుగా  ‘‘నాకు ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలన్నీ అబద్ధం’’ అని కుండ బద్దలు కొట్టారు. హృతిక్ ఇలా వివరణ ఇవ్వడం కంగనాకి ఏమాత్రం నచ్చనట్లుంది. అందుకే, ఎవరెవరికో వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదంటూ ఇన్‌డెరైక్ట్‌గా ఈ హీరోగారికి చురక వేశారు.

‘‘నేను గతాన్ని తవ్వుకునే మనిషిని కాదు. ముగిసిపోయిన అధ్యాయం గురించి అస్సలు మాట్లాడను. ఎదుటివాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? అంటూ వాళ్ల జీవితాల్లోకి ఇతరులు తొంగి చూడటం పద్ధతి కాదు’’ అని కంగనా రనౌత్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement