
కొద్ది రోజులుగా రాజకీయ వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న నటుడు కమల్ హాసన్ కు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చే డెంగ్యూ మందుల విషయంలో కమల్ కామెంట్స్ పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
డెంగ్యూ నివారణకు ప్రభుత్వం ఇస్తున్న నీలవేంబు అనే ఆయుర్వేద ఔషదం వినియోగంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కమల్ కామెంట్ చేయటంపై జీ దేవరాజన్ కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, కమల్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.