అవన్నీ రూమర్స్‌.. కొట్టిపారేసిన హీరో

Kamal Haasan Respond On Indian 2 Rumours - Sakshi

సౌత్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌, లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సీక్వల్‌ ఇండియన్‌ 2. ఈ సినిమాను భారతీయుడు 2 పేరుతో తెలుగులోనూ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 1996లో రిలీజ్‌ అయిన బ్లాక్‌ బస్టర్ హిట్ భారతీయుడుకు ఈ సినిమా సీక్వల్‌. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌కు వెంటనే బ్రేక్‌ పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై హీరో కమల్‌ హాసన్‌ స్పందించారు. ఇండియన్‌ 2 షూటింగ్ పనులు ఆగలేదని తాను రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టుగా వెల్లడించారు. అంతేకాదు మేకప్‌ విషయంలో చిత్ర యూనిట్ సంతృప్తిగా లేదన్న వార్తలను కూడా ఆయన కొట్టి పారేశారు. ఇండియన్‌ 2 పాటు డేట్స్ అడ్జస్ట్ చేసుకొని క్షత్రియపుత్రుడు 2, శభాష్ నాయుడు పనులు కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top