భారతీయుడు ఆగడు | Kamal haasan Bharateeyudu Back On Action | Sakshi
Sakshi News home page

భారతీయుడు ఆగడు

Feb 21 2019 12:12 AM | Updated on Aug 8 2019 11:13 AM

Kamal haasan Bharateeyudu Back On Action - Sakshi

‘ఇండియన్‌ 2’ చిత్రం గురించి విభిన్నమైన వార్తలు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందనేది ఆ షికారు చేస్తున్న వార్తల సారాంశం. నిజమా? ‘భారతీయుడు 2’ ఆగిందా? అని చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రతినిధిని ‘సాక్షి’ అడిగితే – ‘‘ఇండియన్‌ 2’ చిత్రం ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు. చెన్నైలోని ఓ మెమోరియల్‌ హాల్‌లో వారం రోజులు జరిగిన చిత్రీకరణతో తొలి షెడ్యూల్‌ ముగిసింది. రెండో షెడ్యూల్‌ కోసం చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌ వర్క్‌ జరుగుతోంది.

ఈ సెట్‌ వర్క్‌ పూర్తి కాగానే చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుంది. మరోవైపు చిత్రకథానాయకుడు  కమల్‌హాసన్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సో.. సినిమా షెడ్యూల్స్‌ అనుకున్న సమయానికన్నా కాస్త అటూ ఇటూ అవుతాయేమో తప్ప ఆగే ప్రసక్తే లేదు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ప్లాన్‌ చేసిన చిత్రాన్ని వదులుకుంటామా? అని చెప్పారు. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘ఇండియన్‌–2’ ఇదే కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement