సూపర్‌ స్టార్‌ బాటలో కల్యాణ్‌ రామ్‌ | Kalyan Ram to Produce a Web Series | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్టార్‌ బాటలో కల్యాణ్‌ రామ్‌

Feb 23 2019 2:14 PM | Updated on Feb 23 2019 4:00 PM

Kalyan Ram to Produce a Web Series - Sakshi

హీరోగానే కాక నిర్మాతగానూ తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌. ఎక్కువగా తన సినిమాలు తానే నిర్మించుకున్న ఈ హీరో రవితేజ హీరోగా కిక్‌ 2, ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టిన కల్యాణ్‌ రామ్‌, నిర్మాతగా తన పరిధిని మరింత విస్తరించే పనిలో ఉన్నాడు.

త్వరలో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌చేస్తున్నట్టుగా వెల్లడించాడు ఈ హీరో. ప్రేమ, క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలతో కూడిన వెబ్‌ సిరీస్‌ను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా వెబ్‌ సిరీస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. చార్లీ పేరుతో ఓ డిటెక్టివ్‌ తరహా కథతో వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నారు మహేష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement