అది తీవ్రంగా బాధిస్తుంది: జిమ్మీ షెర్గిల్

Jimmy Shergill Shares Emotional Post On Irrfan Khan - Sakshi

బాలీవుడ్‌ లెజండరి నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ను చివరి రోజుల్లో కలుసుకోలేనందుకు నటుడు జిమ్మీ షెర్గిల్‌ విచారం వ్యక్తం చేశాడు. బాలీవుడ్‌లో ‘హసీల్’‌, ‘షాహెబ్‌ బీవీ’, ‘గ్యాంగ్‌స్టార్‌ రిటర్న్స్‌’‌లో ఇర్ఫాన్‌తో కలిసి నటించాడు. ఇక ఇర్ఫాన్‌తో  తనకు ఉన్న అనుబంధాన్ని.. చివరి రోజుల్లో ఆయనను కలుసుకులేనందకు ఎంతగా పశ్చాత్తాప పడుతున్నాడో చెబుతూ భావోద్యేగానికి లోనయ్యారు. ఇర్ఫాన్‌పై ఆయనకు ఉన్న అభిమాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాపూర్వ లేఖ రాశాడు. ‘దీని నుంచి మళ్లీ మాములుగా ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఈ నష్టాన్ని అధిగమంచడానికి చాలా ఏళ్లు తీసుకుంటుంది. మీ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. ఆ షాక్‌ నుంచి బయటకు రాలేక పోతున్నా’ అని పేర్కొన్నాడు. (ఆయన బతికే ఉంటారు: మీరా నాయర్‌)

ఇక ‘‘నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే మిమ్మల్నీ గత కొన్నేళ్లుగా కలవకపోవడం. కలవాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ కుదరలేదు. మనం కలిసి 5 సినిమాల్లో పని చేశాము. మీ పట్ల నాక్ను ప్రేమ, గౌరవం అపారమైనది. అది మీకు కూడా తెలుసు. మన ఇద్దరం కలిసి మొదటిసారి నటించిన ‘హాసిల్’ చిత్రం‌ నుంచే మీ అభిమానిని అయ్యాను. అంతేగాక మీరు నాలాంటీ ఎంతో మందికి ప్రేరణ నిస్తూ స్పూర్తిగా నిలిచారు. చివరిగా మిమ్మల్ని చూడలేకపోయానన్న బాధ నన్ను తీవ్రం కలచివేస్తోంది. ఆ దేవుడు మీ కుటుంబానికి అని విధాల ధైర్యం ఇస్తాడు.  మిస్‌ యూ ఇర్ఫాన్‌ భాయ్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ జిమ్మీ’’ అంటూ ఇన్‌స్టాలో భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఇర్ఫాన్‌ ఖాన్ గత‌ రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ చివరకూ ఏప్రిల్‌ 29న తుది శ్వాస విడిచారు. (మరణంపై ఇర్ఫాన్‌ ఖాన్‌‌ భావోద్వేగ మాటలు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top