వృద్ధాశ్రమంలో జాన్వీ బర్త్‌ డే వేడుకలు | Janhvi Kapoor celebrates her 21st birthday | Sakshi
Sakshi News home page

వృద్ధాశ్రమంలో జాన్వీ పుట్టినరోజు వేడుకలు

Mar 7 2018 12:51 PM | Updated on Mar 7 2018 1:00 PM

Janhvi Kapoor celebrates her 21st birthday - Sakshi

జాన్వీ పుట్టిన రోజు వేడుకల్లో కపూర్‌ కుటుంబ సభ్యులు

శ్రీదేవి మరణించిన బాధనుంచి కపూర్‌ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మంగళవారం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. తల్లి మరణించిన బాధనుంచి జాన్వీని బయటకు తీసుకొచ్చేందుక కపూర్‌ కుటుంబం సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. అందుకోసం జాన్వీ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా జాన్వీ వృద్ధాశ్రమంలో కేక్‌ కట్ చేసి వారితో కొంత సమయం గడిపిన తరువాత కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్‌లో పాల్గొంది.

బోని కపూర్‌ మొదటి భార్య పిల్లలతో శ్రీదేవి కూతుళ్లకు సన్నిహిత సంబంధాలు లేవన్న విమర్శలకు చెక్క పెడుతూ అన్షులా కపూర్‌ కూడా ఈ పార్టీకి హజరైంది. జాన్వీ బర్త్‌ డేకు సంబంధించిన ఫొటోలను సోనమ్ కపూర్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. బోనీ కపూర్‌ దగ్గరుండి జాన్వీతో కేక్‌ కట్ చేయించారు. ఈ పార్టీలో జాన్వీ సొంత చెల్లెలు ఖుషీ కపూర్‌తో పాటు కపూర్‌ ఫ్యామిలీకి చెందిన జహాన్ కపూర్‌, షనయా కపూర్‌, సోనమ్‌ కపూర్‌, రియా కపూర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement