సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!

Jacqueline Fernandez Charged Hefty Fee For Featuring in Saaho Song - Sakshi

సాహో సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్‌, పారితోషికాలకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రత్యేకగీతంలో నటించిన జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న వార్త ఇ‍ప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కేవలం ఒక్క పాటలో నటించినందుకు ఈ భామకు రూ. 2 కోట్ల పారితోషికంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఉత్తరాది నటులనే తీసుకున్న సాహో టీం, సినిమా మీద అంచనాలు మరింత పెంచేందుకు జాక్వలిన్‌తో స్పెషల్‌ సాంగ్ చేయించారు. అందుకే భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మహేష్‌ మంజ్రేకర్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌, లాల్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top