సూపర్‌స్టార్‌కు జంటగా | Is Nayanthara part of Mahesh Babus next with AR Murugadoss? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌కు జంటగా

Sep 16 2016 2:47 AM | Updated on Sep 4 2017 1:37 PM

సూపర్‌స్టార్‌కు జంటగా

సూపర్‌స్టార్‌కు జంటగా

సూపర్‌స్టార్‌కు జంటగా లేడీ సూపర్‌స్టార్ నటించనున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ అంటే ఈ పాటికే అందరికీ

 సూపర్‌స్టార్‌కు జంటగా లేడీ సూపర్‌స్టార్ నటించనున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ అంటే ఈ పాటికే అందరికీ అర్థమయిపోయి ఉంటుంది. ఎస్.అది నయనతారనే. ఈ సంచలన నటి గురించి ఈ మధ్య వారానికో కొత్త చిత్రం గురించి వార్త ప్రచారం జరుగుతోందనవచ్చు. నానుమ్ రౌడీదాన్ చిత్రం నుంచి ఇటీవల తెరపైకి వచ్చిన ఇరుముగన్ వరకూ వరస విజయాలను కైవసం చేసుకుంటున్న నయనతార ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. కార్తీతో నటిస్తున్న కాష్మోరా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
 
  శివకార్తీకేయన్‌తో ఒక చిత్రం, హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం దొర, మింజూర్ గోపి దర్శకత్వంలో మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంతో పాటు నటుడు అధర్వ, జ్ఞానముత్తుల కలయికలో రూపొందనున్న చిత్రంలో ప్రముఖ పాత్ర, తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో సూర్యకు జంటగా మరో సారి నటించడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్‌టాక్. అదే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో నటించనున్నారని సమాచారం.
 
 మహేశ్‌బాబు తాజాగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకిగా నటిస్తున్నారు. ఇందులో నయనతార ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు టాక్. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్యకు జంటగా గజనీ చిత్రంలో నయనతార నటించారు. ఇక తాజా సమాచారం నిజమైతే గజనీ చిత్రం విడుదలై సుమారు 11 ఏళ్లు అవుతోంది. ఆ తరువాత మళ్లీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రంలో నటించ నున్నారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement