నేనందుకు సిద్ధంగా లేను! | I'm not ready for marriage! | Sakshi
Sakshi News home page

నేనందుకు సిద్ధంగా లేను!

Jan 30 2017 8:16 AM | Updated on Oct 30 2018 5:58 PM

నేనందుకు సిద్ధంగా లేను! - Sakshi

నేనందుకు సిద్ధంగా లేను!

నేనింకా పెళ్లికి తయారవలేదని అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌.

నేనింకా పెళ్లికి తయారవలేదని అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. దశాబ్ద కాలం దాటినా టాప్‌ కథానాయకి స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న నటీమణుల్లో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. ఆదిలో విజయాల కోసం నిరీక్షించినా తెలుగు చిత్రం మగధీరతో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తరువాత తన కెరీర్‌ పరంగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. తమిళంలోనూ ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలు వరుస కట్టడంతో స్టార్‌ హీరోయిన్  హోదాను దక్కించుకున్నారు. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 150 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని మరో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు.

ప్రస్తుతం తమిళంలో అజిత్‌తో ఆయన 57వ చిత్రంలో రొమాన్స్  చేస్తున్న కాజల్‌ ఇళయదళపతి విజయ్‌తో త్వరలో డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ  ఏమంటున్నారో చూద్దాం. నేను తెరంగేట్రం చేసి పదేళ్లు దాటింది. ఇప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాను. ఇప్పటి వరకూ నేను నటించిన చిత్రాలన్నీ మంచి కథలతో రూపొందినవే. నాకు మంచి కథా పాత్రలు అమరుతున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నాను. తెలుగులో చిరంజీవితో నటించడం మరచిపోలేని అనుభవం. ఆయన కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, పవన్ కల్యాణ్, అల్లుఅర్జున్ లతోనూ ఇంతకు ముందే కలిసి నటించాను. చిరంజీవి పెద్ద స్టార్‌. అదేమీ ప్రదర్శించకుండా అందరితోనూ చాలా సహజంగా మసలుకోవడం చూసి ఆయన నాకు ఎంతగానో నచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో రానాకు జంటగా ఒక చిత్రం చేస్తున్నాను.

తమిళంలో అజిత్‌ సరసన నటిస్తున్నాను. విజయ్‌ కొత్త చిత్రంలో కమిట్‌ అయ్యాను. ప్రముఖ హీరోల చిత్రాల్లో సింగిల్‌ సాంగ్‌లో నటించడం తప్పులేదు. అలాంటి అవకాశాలు వస్తే మళ్లీ మళ్లీ నటిస్తాను. నాకు డాన్స్   అంటే చాలా ఇష్టం. పెళ్లెప్పుడని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి అలోచించడానికి నాకిప్పుడు సమయం లేదు. ఇంకా చెప్పాలంటే నేను పెళ్లికి తయారు కాలేదు. ఎవరినీ ప్రేమించలేదు.పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను.అది సమయం వచ్చినప్పుడు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement