
ట్విటర్‌లో షేర్ చేసిన చిత్రం
భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా...
తానే గనుక సూపర్ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా అంటున్నారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. కొన్ని దశాబ్ధాల క్రితం దిగిన ఓ ఫొటోను అమితాబ్ షేర్ చేశారు. ఆ ఫొటోలో సూపర్ మ్యాన్ దుస్తుల్లో ఉన్నారాయన. ‘ చాలా ఏళ్ల క్రితం అభిషేక్ ఫ్యాన్సీ డ్రెస్ బర్త్‌డే పార్టీ సందర్భంగా వేసుకున్న డ్రెస్. సూపర్ మ్యాన్ థీమ్ డ్రెస్. నేను నిజజీవితంలో సూపర్ మ్యాన్‌లా మారగలిగితే భయంకరమైన కరోనా మహమ్మారిని నాశనం చేసేస్తా’నని పేర్కొన్నారు.
కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఆదివారాలు అభిమానులను కలుసుకునే సాంప్రదాయానికి కూడా ఆయన సెలవు ప్రకటించారు. ప్రతీ ఆదివారం ముంబైలోని జల్సా బంగ్లా వద్దకు వచ్చి అభిమానులను పలకరిస్తుంటారు అమితాబ్. కొద్దిరోజుల క్రితం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘ అభిమానులు, నా శ్రేయోభిలాషులకు నా విన్నపం! దయచేసి మీరు ఆదివారాలు జల్సా గేట్ దగ్గరకు రాకండి, నేను కూడా రావటం లేదు. జాగ్రత్తలు తీసుకోండ’ని విజ్ఞప్తి చేశారు. ( 'నేను రావడం లేదు.. మీరు రావద్దు')
T 3476 - A fancy dress birthday party for Abhishek in his very early years .. dress theme 'SUPERMAN' ..
— Amitabh Bachchan (@SrBachchan) March 20, 2020
काश की वास्तव में हम superman बन कर इस सभयंकर महामारी Corona Virus को सदा के लिए नष्ट कर सकते !! pic.twitter.com/DvT90WYs6f