చచ్చినా మళ్లీ ప్రేమలో పడను! | I will never date any man again | Sakshi
Sakshi News home page

చచ్చినా మళ్లీ ప్రేమలో పడను!

Jan 22 2018 1:19 AM | Updated on Jan 22 2018 10:20 AM

I will never date any man again - Sakshi

ఏంజెలినా జోలికి ఇప్పుడు 42 ఏళ్లు. రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్‌గా నటించిందో ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇప్పుడింక ఆమెకు ఆరుగురు పిల్లలు. భర్తతో విడిపోయి, ఆ పిల్లలందరినీ తనే పెంచుతోంది. అయినా తనపై ఉన్న ఒత్తిడి సినిమాల్లో కనిపించనివ్వదు. అదెలా సాధ్యమని అడిగితే నవ్వి ఊరుకుంటుంది కానీ, పెద్ద సంఘర్షణే జరుగుతూ ఉండాలి ఆమెలో, ప్రతిరోజూ.

అందుకేనేమో భర్త బ్రాడ్‌పిట్‌తో 2016లో విడిపోయాక పిల్లలే ప్రాణంగా గడిపేస్తోన్న ఏంజెలినా, మళ్లీ ప్రేమలో పడతారా? అని అడిగితే, అలాంటివి అస్సలు చెయ్యను. ‘‘మళ్లీ చచ్చినా ప్రేమలో పడను’’ అని చెప్పేస్తోంది. ఎందుకు? అని అడిగితే పిల్లలకు తన అవసరం ఉందని, వాళ్లను పెంచాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతోంది. మరోపక్క ఆమె భర్త బ్రాడ్‌పిట్‌ మాత్రం ఏంజెలినాతో విడిపోయాక వరుసగా ప్రేమలో పడిపోతూనే ఉన్నాడు. అయితే అవేవీ సీరియస్‌ ప్రేమలు కావట. ఏంజెలినా మాత్రం అదెలాంటి ప్రేమైనా ఆ జోలికి మాత్రం పోనని గట్టిగా చెప్పేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement