'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా' | I never take money for acting in films: Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా'

Apr 16 2016 7:22 PM | Updated on Apr 3 2019 6:34 PM

'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా' - Sakshi

'సినిమా హిట్ అయితేనే డబ్బు తీసుకుంటా'

సినిమాల్లో నటించినందుకు తానెప్పుడూ డబ్బులు తీసుకోలేదని షారుక్ చెబుతున్నాడు.

ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఓ సినిమాలో నటించినందుకు ఎంత డబ్బు తీసుకుంటాడు? ఆయన పారితోషకం 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే సినిమాల్లో నటించినందుకు తానెప్పుడూ డబ్బులు తీసుకోలేదని షారుక్ చెబుతున్నాడు. బాక్సాఫీసు వద్ద తన సినిమాలు హిట్ అయితే నిర్మాతలు ఇష్టపూర్వకంగా ఇచ్చింది తీసుకుంటానని చెప్పాడు.

'నా సినిమాలు హిట్ అయితేనే నాకు డబ్బులు ఇవ్వమని నిర్మాతలకు చెబుతా. అదికూడా వాళ్లు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే మొత్తం తీసుకుంటా. డబ్బుల కోసం డిమాండ్ చేయను. ఎండార్స్మెంట్లు, ఈవెంట్లు, లైవ్ షోలలో పాల్గొన్నందుకు మాత్రమే ఫీజు తీసుకుంటాను. సినిమాల్లో నటించడాన్ని వ్యాపారంగా భావించను. నేను సినిమాల్లో నటిస్తూ ఉండాలి. వీలైనంతవరకు ఎక్కువ మంది నా సినిమాలు చూడాలన్నదే నా ఆశ' అని షారుక్ అన్నాడు. షారుక్ తాజా చిత్రం ఫ్యాన్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement