నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ | I dedicated my book Ayn Rand, Bruce Lee, Urmila | Sakshi
Sakshi News home page

నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ

Nov 25 2015 1:59 PM | Updated on Sep 3 2017 1:01 PM

నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ

నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ

తన ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ట్యాగ్‌లైన్‌' పుస్తకాన్ని పలువురికి అంకితం చేస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు.

హైదరాబాద్: తన ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ట్యాగ్‌లైన్‌' పుస్తకాన్ని పలువురికి అంకితం చేస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఊర్మిళా మండోద్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్, మరికొందరు గ్యాంగస్టర్లకు అంకితం ఇస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాను జీవితంలో పైకి రావడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా వీరంతా తోడ్పడ్డారని తెలిపారు.

రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల చేయన్నారు. పుస్తకం కవర్ పేజీని ఇటీవలే ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తో, మహిళలతో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వర్మ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఈ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement