నాకు అందులో నటించాలని ఉంది | Helen Mirren wants to play villain in 'Fast and Furious 8' | Sakshi
Sakshi News home page

నాకు అందులో నటించాలని ఉంది

Mar 31 2015 11:40 AM | Updated on Sep 2 2017 11:38 PM

నాకు అందులో నటించాలని ఉంది

నాకు అందులో నటించాలని ఉంది

లాస్ ఎంజిల్స్: తనకు ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ 8లో నటించాలని ఉందని ప్రముఖ హాలీవుడ్ నటి హెలెన్ మిర్రెన్ (69) అన్నారు.

లాస్ ఎంజిల్స్: తనకు ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ 8లో నటించాలని ఉందని ప్రముఖ హాలీవుడ్ నటి హెలెన్ మిర్రెన్ (69) అన్నారు. ఈ చిత్రాలను అమితంగా ప్రేమించే ఆవిడ అవకాశం ఇస్తే 8వ సిరీస్లో విలన్ పాత్ర పోషించాలని ఉందని, అందులో దుమ్ములేచిపోయేలా కారు నడపాలని ఉందని పేర్కొంది. సొంతంగా కారు నడుపుతూ వెళుతుంటే ఆ మజానే వేరని, టాప్ గేర్ ఉన్నప్పుడు ఆ ఆనందం చెప్పలేమని అన్నారు.  ఫాస్ట్ ఫ్యూరియస్ 8లో నటించాలనుకోవడం తన కల అని, తప్పకుండా నటిస్తానని తెలిపారు.

మరో హాలీవుడ్ ప్రముఖ నటుడు విన్ డీసెల్కు ప్రత్యేక అభిమాని అయిన ఆమె డీసెల్ అంటే తనకు చాలా ఇష్టమని, తానెప్పుడు అతడిని ప్రేమిస్తూ ఉంటాని, నిజానికి అతడు చాలా గొప్పవాడంటూ కితాబిచ్చింది. ఫన్ ఎక్కువగా ఏ చిత్రాల్లో ఉంటే ఆ చిత్రాలు తనకు అమితంగా ఇష్టమని చెప్పింది. ఫాస్ట్ ఫ్యూరియస్ చిత్రం సీక్వెల్లో భాగంగా వస్తున్న ఫాస్ట్ ప్యూరియస్ 7 ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement