గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందా?
మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్ అంటే... కథానాయికలకు అది గోల్డెన్ ఛాన్సే. అందుకే... సూపర్‌స్టార్‌కు జోడీ కట్టడానికి హీరోయిన్లందరూ పోటీపడుతుంటారు. కానీ... శ్రుతిహాసన్ మాత్రం ఆ అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నారని ఫిలింనగర్ టాక్.
మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్ అంటే... కథానాయికలకు అది గోల్డెన్ ఛాన్సే. అందుకే... సూపర్‌స్టార్‌కు జోడీ కట్టడానికి హీరోయిన్లందరూ పోటీపడుతుంటారు. కానీ... శ్రుతిహాసన్ మాత్రం ఆ అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నారని ఫిలింనగర్ టాక్. వివరాల్లోకెళితే... మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆగడు’. ప్రస్తుతం సుకుమార్‌తో మహేష్ ‘1’ చిత్రం చేస్తున్నారు.
ఈ సినిమా పూర్తయ్యాక ‘ఆగడు’ సెట్స్‌కి వెళుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్‌కి జోడీగా చాలామంది హీరోయిన్లను అనుకున్నా... చివరకు శ్రుతిహాసన్‌ను ఖరారు చేశారట. అయితే... కథానుగుణంగా ‘ఆగడు’లో ఇద్దరు కథానాయికలు అవసరం అవ్వడంతో... ఆ రెండో నాయిక కోసం దర్శక, నిర్మాతలు తమన్నాను సంప్రదించినట్లు సమాచారం.
ఆ విషయం తెలుసుకున్న శ్రుతిహాసన్ ‘ఆగడు’ నుంచి తప్పుకుంటున్నట్లు దర్శక, నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పేశారట. ఫిలింనగర్‌లో ప్రస్తుతం హాట్ హాట్‌గా వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్ ఇది. అటు బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకునే విషయంలో కానీ, సౌత్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే విషయంలో కానీ ఈ బ్యూటీలు తెగ పోటీపడుతున్నారట. అందుకే.. తాను నటించే సినిమాలో తమన్నా ఉండటం ఇష్టంలేని శ్రుతి.. ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.