
రొమాంటిక్ ‘గాలిపటం’
‘‘మిత్రుడైన నవీన్‌గాంధీ కోసం సంపత్ నంది టీమ్ ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఈ సినిమా మంచి విజయం సాధించి సంపత్ నంది టీమ్‌కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి.
‘‘మిత్రుడైన నవీన్‌గాంధీ కోసం సంపత్ నంది టీమ్ ఇలాంటి ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఈ సినిమా మంచి విజయం సాధించి సంపత్ నంది టీమ్‌కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి. అంతేకాదు, త్వరలో సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ‘గబ్బర్‌సింగ్-2’ అఖండ విజయాన్ని అందుకోవాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ ఆకాంక్షించారు. ఆది కథానాయకునిగా నవీన్‌గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గాలిపటం’. ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టీనా అఖీవా, ప్రీతీ రానా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకంపై సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ, వి.వి.వినాయక్, సాయికుమార్ దంపతుల చేతుల మీదుగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ‘‘సమకాలీన అంశాలతో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నా మిత్రుణ్ణి ప్రోత్సహించాలి, కొత్త కళాకారులను పరిశ్రమకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘గాలిపటం’ లోగో ఎంత బాగుందో... సినిమా కూడా అంత బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకూ తాను చేసిన కథలతో పోల్చి చూస్తే ఇది కొత్తగా ఉంటుందని, తన పాత్రలో భిన్న కోణాలుంటాయని ఆది పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం:
భీమ్స్, కెమెరా: బుజ్జి.