‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

Director Respond On Second Heroine In Nithin Bheeshma - Sakshi

వరుస ఫ్లాప్‌లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌.

ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్తలపై దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చారు. భీష్మలో ఒకే హీరోయిన్‌ఉంటుందని ఆ పాత్ర రష్మికను ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top