హీరోయిన్ నగ్నవీడియో లీక్పై స్పందించిన డైరెక్టర్ | director Leena Yadav: people excited about leaked sex scene | Sakshi
Sakshi News home page

హీరోయిన్ నగ్నవీడియో లీక్పై స్పందించిన డైరెక్టర్

Sep 13 2016 6:24 PM | Updated on Sep 27 2018 8:48 PM

హీరోయిన్ నగ్నవీడియో లీక్పై స్పందించిన డైరెక్టర్ - Sakshi

హీరోయిన్ నగ్నవీడియో లీక్పై స్పందించిన డైరెక్టర్

బాలీవుడ్ సినిమా పార్ష్‌డ్లో హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన శృంగార సన్నివేశాల వీడియో లీక్ కావడంపై చిత్ర దర్శకురాలు లీనా యాదవ్ స్పందించింది.

త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ సినిమా పార్ష్‌డ్లో హీరోయిన్ రాధికా ఆప్టే హాట్హాట్గా నటించిన శృంగార సన్నివేశాల వీడియో లీక్ కావడంపై చిత్ర దర్శకురాలు లీనా యాదవ్ స్పందించింది. సాధారణంగా  సంచలన విషయాలపై ఆసక్తి చూపుతారని, అలాగే కొందరు ఈ సినిమా నుంచి లీక్ అయిన శృంగార వీడియోపై అమితాసక్తి చూపారని చెప్పింది. అయితే ఈ వీడియో లీక్ ఘటనను  ఇప్పుడు పెద్దగా పట్టించుకోరని అభిప్రాయపడింది. అందరూ భావిస్తున్నట్టు ఈ సినిమాలో అశ్లీలత లేదని.. వితంతువు, సెక్స్ వర్కర్, వైవాహిక లైంగికదాడి బాధితురాలి జీవితాలను స్పృశిస్తూ తెరకెక్కించామని తెలిపారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నిర్మాతగా, లీనా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఇందులో రాధికా ఆప్టే, ఆడిల్ హుస్సేన్, తనిష్ఠా ఛటర్జీ, సుర్వీన్ చావ్లా తదితరులు నటించారు. రాధికా ఆప్టే, ఆడిల్ పాల్గొన్న శృంగార సన్నివేశాల వీడియా లీక్ కావడం ఇటీవల సంచలనం కలిగించింది. ఈ సినిమా ట్రైలర్ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా లీనా మాట్లాడుతూ.. సినిమాల ద్వారా సమాజాన్ని మార్చలేమని, కనీసం సామాజిక అంశాలపై చర్చించుకునే అవకాశముందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement