సచిన్‌ ట్వీట్‌కు క్రికెట్‌ భాషలో చిరు రిప్లై | Chiranjeevi Reply To Sachin Tendulkar Tweet | Sakshi
Sakshi News home page

సచిన్‌ ట్వీట్‌కు క్రికెట్‌ భాషలో చిరు రిప్లై

Apr 28 2020 6:18 PM | Updated on Apr 28 2020 9:31 PM

Chiranjeevi Reply To Sachin Tendulkar Tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఆలస్యంగా జాయిన్ అయినా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నెటిజన్లకు కావాల్సినంత వినోదంతో పాటు మంచి సందేశాలను కూడా అందిస్తున్నాడు. ఈ రోజు ఉదయం తన మనువరాలు నవిష్క(శ్రీజ చిన్న కుమార్తె)తో చేసిన సందడికి సంబంధించిన వీడియోను  పోస్ట్‌ చేసి నెటిజన్లను ఆకట్టుకోగా, తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ట్వీట్‌కు క్రికెట్‌ పరిభాషలో సమాధానం ఇచ్చి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 
(చదవండి : చిరు ఎంజాయ్‌ చేస్తున్న పాట ఇదే..)

ఏప్రిల్ 24న‌ స‌చిన్ బ‌ర్త్‌డే కావ‌డంతో చిరంజీవి ట్వీటర్‌ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. దీనిపై సచిన్ స్పందిస్తూ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా సచిన్ ట్వీట్ కు చిరంజీవి బదులిచ్చారు. ‘థాంక్యూ సచిన్ బ్రదర్, అంతా క్షేమం. ఇప్పటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో డిఫెన్స్ ఆడడమే సరైన విధానం. నేను అందరికీ ఇదే విషయం చెబుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement