ఫ్యాన్స్‌కు మాధురీదీక్షిత్ స‌వాల్.. క‌నిపెట్ట‌గ‌ల‌రా? | Can You Guess Who Is Madhuri Dixit In This Picture | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు మాధురీదీక్షిత్ స‌వాల్.. క‌నిపెట్ట‌గ‌ల‌రా?

May 9 2020 9:13 AM | Updated on May 9 2020 9:34 AM

Can You Guess Who Is  Madhuri Dixit In This Picture  - Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన సెల‌బ్ర‌టీలు నిత్యం సోష‌ల్ మీడియాలో ట‌చ్‌లో ఉంటున్నారు. షూటింగ్‌ల‌తో ఎప్ప‌డూ బిజీబిజీగా గ‌డిపే స్టార్స్ కు బోలెడంత స‌మ‌యం మిగ‌లింది. దీంతో తమ కొత్త టాలెంట్‌ల‌ను బ‌య‌ట‌పెడుతూ స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. అంతేకాకుండా ఈ మ‌ధ్య త్రోబ్యాక్ చాలెంజ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. పాత ఙ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకుంటూ ఒక్క‌సారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతున్నారు. అప్ప‌టి అనుభ‌వాలు, విశేషాల‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. (1000 మంది ప్రేక్షకుల మధ్య ఆ పాటను చిత్రీకరించాం )

తాజాగా బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. త‌న సోద‌రితో క‌లిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. నా సోద‌రితో ఉన్న అత్యంత మ‌ధుర జ్ఞాపకాలలో ఇది కూడా ఒక‌టి అంటూ క్యాప్ష‌న్ జోడించారు. అంతేనా.. ఇద్ద‌రిలో ఎవ‌రు మాధురీ దీక్షితో క‌నిపెట్టాలంటూ ఫ్యాన్స్‌కు ఓ స‌వాల్ కూడా విసిరారు. నిజానికి ఇద్ద‌రికీ చాలా ద‌గ్గ‌రి పోలిక‌లుండ‌టంతో ఎవ‌రు మాధురీ దీక్షిత్ అన్న‌ది క‌నిపెట్ట‌డం చాలా కష్టంగానే ఉంది. చిన్న‌ప్ప‌డు త‌న సోద‌రితో కలిసి అనేక డ్యాన్స్ కాంపిటీష‌న్‌ల‌లో పాలు పంచుకునేవాళ్ల‌మ‌ని పేర్కొన్నారు. ఇక 52 ఏళ్ల మాధురీ.. ఇప్ప‌టికీ త‌న డ్యాన్స్ తో అభిమానుల‌ను అలరిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement