
ప్రజా కళాకారునిగా...
‘‘ప్రజల్ని చైతన్య పరిచే కళాకారుని పాత్రను నేను ఈ సినిమాలో పోషించాను. అతిథి పాత్ర అయినా ఈ చిత్రానికి ఆయువుపట్టులాంటిది. నాపై రెండు సోలో పాటలు కూడా చిత్రీకరించారు.
‘‘ప్రజల్ని చైతన్య పరిచే కళాకారుని పాత్రను నేను ఈ సినిమాలో పోషించాను. అతిథి పాత్ర అయినా ఈ చిత్రానికి ఆయువుపట్టులాంటిది. నాపై రెండు సోలో పాటలు కూడా చిత్రీకరించారు. నా కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ఇది’’ అని మాదాల రవి చెప్పారు. పోసాని కృష్ణమురళి హీరోగా మద్దినేని రమేశ్ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రోకర్-2’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇందులో మాదాల రవి ప్రత్యేక పాత్ర పోషించారు. మద్దినేని రమేశ్ మాట్లాడుతూ -‘‘ఇదొక ప్రత్యేకమైన సినిమా. సమాజానికి నిలువుటద్దంగా నిలిచే చిత్రం. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో విజయం సాధించడం ఖాయం’’ అని నమ్మకం వ్యక్తపరిచారు. ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, సంగీతం: విజయ బాలాజీ, కెమెరా: వెంకట్ మన్నం, నిర్మాతలు: జి. భరత్, మందలపు సుధాకర్‌రావు.