బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా | Bigg Boss 3 Telugu: Srimukhi, Ali Reza Emotional On Their Journey | Sakshi
Sakshi News home page

అందరినీ ఏడిపించడానికే సిద్ధపడిపోయిన బిగ్‌బాస్‌

Oct 31 2019 12:59 PM | Updated on Nov 1 2019 9:26 AM

Bigg Boss 3 Telugu: Srimukhi, Ali Reza Emotional On Their Journey - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3 రియాలిటీ షో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్నిరోజులుగా కలిసి ఉన్న ఇంటి సభ్యులు మరో రెండు మూడు రోజుల్లో విడిపోనున్నారు. బిగ్‌బాస్‌ షో అనేది వారి జీవితంలో మధురానుభూతుల పేజీగా మిగిలిపోనుంది. అయితే ఇన్ని రోజులు హౌస్‌లో ఎలా ఉన్నారో, వారేంటో వాళ్లకే చూపించడానికి బిగ్‌బాస్‌ రెడీ అయిపోయాడు. ఈ మేరకు ఇప్పటికే వరుణ్‌, రాహుల్‌, బాబా భాస్కర్‌లను ఒక్కొక్కరిగా పిలిచి బిగ్‌బాస్‌ ఇంట్లో కొనసాగిన జర్నీ వీడియోను చూపించాడు. అది చూస్తూ హౌస్‌మేట్స్‌ ఎమోషనల్‌ అవడంతోపాటు ఇంతమంచి చాన్స్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలిన ఇంటి సభ్యులైన శ్రీముఖి, అలీ రెజాకు నేటి ఎపిసోడ్‌లో వారి బ్యూటిఫుల్‌ జర్నీని చూపించనున్నాడు. తాజా ప్రోమోను చూసినట్టయితే జర్నీ వీడియోను చూస్తున్న అలీ, శ్రీముఖిలు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో హౌస్‌లోని జ్ఞాపకాలను చూసి సంతోషంతో మురిసిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్‌బాస్‌ ఇంట్లో ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ ఏడిపించేస్తున్నాడు. నేడు కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎమోషన్‌ బాగానే పండనుందని స్పష్టమవుతోంది. మరి మిగతా హౌస్‌మేట్స్‌ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Advertisement
 
Advertisement
Advertisement