‘మా ఏపీ’లోకి తెలంగాణ, చెన్నై టెక్నీషియన్లు

Andhra Pradesh Movie Artists Association - Sakshi

మేలో తెనాలిలో కీలక సమావేశం

మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా

సాక్షి, తెనాలి: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా–ఏపీ) యూనియన్‌లో ఇప్పటివరకు తెలంగాణ, చెన్నై నుంచి 200 మందికి పైగా సినిమారంగ టెక్నీషియన్లు సభ్యత్వం తీసుకున్నట్లు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా తెలిపారు. మా–ఏపీ కీలక నిర్ణయాల సమావేశాన్ని మే నెల మొదటి వారంలో తెనాలిలోనే జరిపేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. సంస్థ అధ్యక్షురాలు కవిత, ఉపాధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, కార్యదర్శులు అన్నపూర్ణ, గీతాంజలి, శ్రీలక్ష్మితో పాటు చెన్నై యూనియన్‌ సభ్యులు హాజరుకానున్నట్టు వివరించారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిలీప్‌రాజా మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం పదేళ్ల తర్వాత ఏపీలోని సినిమా యూనియన్లకే ప్రాధాన్యత ఉంటుందని గుర్తుచేశారు. కెమెరా అసిస్టెంట్లు, లైట్‌ ఆఫీసర్లు, మేకప్‌ మెన్, ఆర్ట్‌ విభాగం, ప్రొడక్షన్‌ విభాగం, రవాణా, నగారా వంటి వివిధ శాఖల టెక్నీషియన్లు సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. సినిమాకు చెందిన నిజమైన టెక్నీషియన్లకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉంటుందన్నారు. వివిధ శాఖల్లో పని నేర్చుకుంటున్న వ్యక్తులకు అప్రెంటిస్‌ సభ్యత్వం ఇస్తున్నామని వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top