
సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు బిగ్ బి. చిరంజీవి కోరిక మేరకు సైరా నటించేందుకు అంగీకరించానని తెలిపిన అమితాబ్ సినిమాలో తన లుక్ ను రివీల్ చేస్తూ ఓ తెలుగు ట్వీట్ చేశారు.
‘సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. బుధవారం రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా శుభాకాంక్షలు తెలిపిన అమితాబ్ గురువారం నుంచి సైరా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
T 2757 -సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి pic.twitter.com/E2R2xKnm2C
— Amitabh Bachchan (@SrBachchan) 28 March 2018