దువ్వాడ జగన్నాథమ్గా బన్నీ | Allu arjun Harish Shankar movie gets its launch date | Sakshi
Sakshi News home page

దువ్వాడ జగన్నాథమ్గా బన్నీ

Aug 28 2016 3:40 PM | Updated on Sep 4 2017 11:19 AM

దువ్వాడ జగన్నాథమ్గా బన్నీ

దువ్వాడ జగన్నాథమ్గా బన్నీ

సరైనోడు సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకొని ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ...

సరైనోడు సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకొని ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు. వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న బన్నీ తన నెక్ట్స్ సినిమాతో భారీ వసూళ్లు సాధించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో సాయి ధరమ్ తేజ్కు మంచిహిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను ప్రారంభిస్తున్నాడు బన్నీ. హీరోయిజానికి మంచి కామెడీ ఎలిమెంట్స్ను జోడిచడంలో స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్, బన్నీ కోసం ఎనర్జిటిక్ స్క్రిప్ట్ను రెడీ చేశాడట. ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభం కానుంది.  ఈ సినిమాకు డిజె (దువ్వాడ జగన్నాథమ్) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement