బన్ని అభిమానులకు ‘పుష్ప’ సర్‌ప్రైజ్‌ | Allu Arjun And Sukumar New Telugu Movie Title Announced | Sakshi
Sakshi News home page

బన్ని అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సుకుమార్‌

Apr 8 2020 9:25 AM | Updated on Apr 8 2020 12:53 PM

Allu Arjun And Sukumar New Telugu Movie Title Announced - Sakshi

స్టైలీష్‌ స్టార్‌, యూత్‌ ఐకాన్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహపడ్డారు. అయితే ఈరోజు అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చిత్ర టైటిల్‌తో పాటు బన్ని ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాకుండా ఆయా భాషల్లో సంబంధించిన పోస్టర్స్‌ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

లీకువీరులు చెప్పినట్టు ఈ సినిమాకు ‘పుష్ఫ’అనే టైటిల్‌నే చివరికి ఫిక్స్‌ చేశారు. ఇక ఫస్ట్‌లుక్‌లో మాసిన గడ్డం, జుట్టు, మెడకు నల్ల తాడు, డీ గ్లామర్‌ అండ్‌ రఫ్‌ లుక్‌లో అల్లు అర్జున్‌ డిఫరెంట్‌గా కొత్తగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా అతడు వేసుకున్న షర్ట్‌ కూడా పాత స్టైల్లో ఉంది. దీంతో ఈ సినిమా 1980ల ​కాలంలో సాగే కథ కావచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారాన్ని బట్టి ఈ సినిమాలో లారీ డ్రైవర్‌ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. దీంతో లారీ డ్రైవర్‌ పాత్రకు తగ్గట్టు బన్ని లుక్‌ను సకుమార్‌ డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది. ప్రసుత్తం ‘పుష్ప’  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

‘ఏమబ్బా, అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే.. ఏఏ20 అప్‌డేట్‌ ఏప్రిల్‌ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా, యోవ్ సిద్ధంగా ఉండారా?!’  అంటూ చిత్ర నిర్మాణ సంస్థ రాయలసీమ యాసలో వరుస ట్వీట్లు చేసింది. అయితే అధికారికంగా ప్రకటించే వరకు ఓపికపట్టని కొందరు నిన్న సాయంత్రమే అల్లు అర్జున్‌ కొత్త సినిమా టైటిల్‌ ‘పుష్ప’అని అందులో బన్ని పేరు ‘పుష్పక్‌ నారాయణ్‌’ అని రివీల్‌ చేశారు. ఇక ‘అల.. వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత బన్ని చేస్తున్న చిత్రం కావడం, ఇప్పటికే సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య2 చిత్రాలు భారీ హిట్‌ సాధించడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  


చదవండి:
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి 
పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement