ఫస్ట్ హీరోయిన్ కి బెస్ట్ విషెస్.. | 'All the best Pooja' tweets Varun Tej | Sakshi
Sakshi News home page

ఫస్ట్ హీరోయిన్ కి బెస్ట్ విషెస్..

Aug 11 2016 7:33 PM | Updated on Sep 4 2017 8:52 AM

ఫస్ట్ హీరోయిన్ కి బెస్ట్ విషెస్..

ఫస్ట్ హీరోయిన్ కి బెస్ట్ విషెస్..

మెగా హీరో వరుణ్ తేజ్.. తన ఫస్ట్ హీరోయిన్కి బెస్ట్ విషెస్ చెబుతున్నాడు. 'ముకుంద' సినిమాతో వరుణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

మెగా హీరో వరుణ్ తేజ్.. తన ఫస్ట్ హీరోయిన్కి బెస్ట్ విషెస్ చెబుతున్నాడు. 'ముకుంద' సినిమాతో వరుణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో వరుణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. వీరి జంటకు మంచి పేరే వచ్చింది.

తాజాగా పూజా.. చారిత్రాత్మక కథతో రూపొందిన 'మొహంజొదారో' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు 'ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. హృతిక్ హీరోగా నటిస్తున్న మొహంజొదారో ఈ శుక్రవారం విడుదల కానుంది.

కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ హీరోగా నటిస్తున్న 'ఫిదా' చిత్ర షూటింగ్ ఊపందుకుంది. కథలో హీరోయిన్ తెలంగాణకు చెందిన అమ్మాయి కావడంతో బాన్సువాడలో సినిమాను చిత్రీకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement