ఒకటే మాట.. సూపర్‌ హిట్‌ | Gaddala Konda Ganesh Success Celebrations | Sakshi
Sakshi News home page

ఒకటే మాట.. సూపర్‌ హిట్‌

Sep 21 2019 12:51 AM | Updated on Sep 21 2019 12:51 AM

Gaddala Konda Ganesh Success Celebrations - Sakshi

రామ్‌ ఆచంట, హరీశ్‌ శంకర్, నాగబాబు, వరుణ్‌ తేజ్, గోపి ఆచంట

‘‘ప్రీమియర్‌ షోస్‌ పడినప్పటి నుంచి పాజిటివ్‌ టాక్‌ మొదలైంది. ఆనందంతో నిద్రపట్టలేదు. చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు ఫోన్‌ చేసి అభినందించారు. ఇది నా ఒక్కడి సక్సెస్‌ కాదు మా టీమ్‌ది’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా  పూజా హెగ్డే, మృణాళిని రవి, అథర్వ ముఖ్య పాత్రధారులుగా రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌ వచ్చిందని చిత్రబృందం తెలిపింది.

ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో నాగబాబు, 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపి ఆచంట, వరుణ్‌ తేజ్, హరీశ్‌ శంకర్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ‘‘అందరి నోటా ఒకటే మాట.. సూపర్‌హిట్‌ అని. వరుణ్‌ వన్‌ మేన్‌ షో అంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవిగారు ఫోన్‌ చేయడంతో మాకు ఇంకా ఎనర్జీ వచ్చింది. కొంతమందైతే నీ కెరీర్‌ బెస్ట్‌ వర్క్‌ అన్నారు. వరుణ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ కావడం ఆనందం’’ అన్నారు హరీశ్‌ శంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement