‘స్టేటస్‌ తప్ప ఇంకేం మారదు’

Alia Bhatt Asked Will She Quit Acting After Marriage - Sakshi

అలియా భట్‌ - రణ్‌బీర్‌ కపూర్‌.. బాలీవుడ్‌లో లవ్‌బర్డ్స్‌ జాబితాలో చేరిన మరో కొత్త జంట. ఇప్పటికే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, ఒకరినోకరు పొగుడుకుంటూ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్తుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కరణ్‌ జోహర్‌ ‘బ్రహ్మస్త్ర’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది కూడా ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే. దాంతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తైన తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం బీ టౌన్‌లో షికారు చేస్తున్నాయి.

ఈ విషయం గురించి అలియా స్నేహితులు కూడా ‘ప్రస్తుతం అలియా తన జీవితంలో చాలా మంచి దశలో ఉంది. తను ప్రేమలో పడింది. వారు ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉన్నారు. పెళ్లి ఒక్కటే మిగిలింది. కాకపోతే 2020 వరకూ వారు పెళ్లి చేసుకోకపోవచ్చు’ అంటున్నారు. ఈ సంగతి కాస్తా బయటకు పొక్కడంతో ప్రస్తుతం అలియా - రణ్‌బీర్‌ కపూర్‌ల అభిమానులు వీరి పెళ్లి తేదిని గెస్‌ చేసే పనిలో ఉన్నారు. అంతేకాక వివాహం అయిన తర్వాత అలియా సినిమాల్లో కొనసాగుతారా..? లేరా..? అనే అంశం గురించి కూడా చర్చిస్తున్నారు.

ఈ నేపధ్యంలో తాజగా అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’(ఏదైనా అడగండి) అంటూ అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘వివాహం తర్వాత మీరు సినిమాలు చేయడం మానేస్తారా’ అని అడిగారు. అందుకు అలియా ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులనే కాక నెటిజన్లను కూడా ఫిదా చేసింది. అభిమాని అడిగిన ప్రశ్నకు అలియా ‘వివాహం తర్వాత మన స్టేటస్‌(సింగిల్‌, రిలేషన్‌ ఇలాంటివి)ని తప్ప, దేన్ని వదులుకోకూడదు. నాకు బోర్‌ కొట్టేంత వరకూ నటిస్తూనే ఉంటాను’ అంటూ సమాధానమిచ్చారు. ఈ సమాధానం విన్న తర్వాత 2త్వరలోనే వీరు ఓ ఇంటి వారు అవుతారేమో అనిపిస్తోంది’ అంటున్నారు అభిమానులు.

గతంలో రణ్‌బీర్‌ ఒక ప్రముఖ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్తూ ‘మరో కొత్త మనిషి.. కొత్త బంధం. గతంలో చేసిన పనులనే ఇప్పుడు మరోసారి మరికాస్తా కొత్తగా చేస్తున్నాను. అవును.. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇప్పుడు నాకు బంధాలను నిలుపుకునే పరిపక్వత వచ్చిందనే అనుకుంటున్నాను. మరి కొద్ది రోజులు మా బంధాన్ని సాగనీయండి’ అంటూ అలియాతో తను ప్రేమలో ఉన్న విషయాన్ని తెలిపాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top