మళ్లీ ట్విట్టరెక్కేసింది | after mahesh incident agian samantha using twitter | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్విట్టరెక్కేసింది

Feb 10 2014 12:38 AM | Updated on Sep 2 2017 3:31 AM

మళ్లీ ట్విట్టరెక్కేసింది

మళ్లీ ట్విట్టరెక్కేసింది

‘ఈ అమ్మాయి మొదట్లో బాగానే ఉండేదే... ఉన్నట్లుండి పాపం ఇలా తయారైందేంటి?..’ ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్‌లో సమంత గురించి ఇదే చర్చ.

 ‘ఈ అమ్మాయి మొదట్లో బాగానే ఉండేదే... ఉన్నట్లుండి పాపం ఇలా తయారైందేంటి?..’ ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్‌లో సమంత గురించి ఇదే చర్చ. మాట్లాడితే ట్విట్టర్ ఎక్కేయడం, అవాకులు, చెవాకులు పోస్ట్ చేయడం సమంతకు అలవాటైపోయిందని పలువురు విమర్శల్ని కూడా సంధిస్తున్నారు. ఏదిఏమైనా.. ఇలాంటి చర్యలు కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నామధ్య... మహేష్ ‘1’ సినిమా గురించి తనకు సంబంధం లేకపోయినా... ట్విట్టర్ ద్వారా రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు కథానాయికగా తీసుకున్న పాపానికి సూర్య, లింగుస్వామిలపై ట్వీట్స్ శరాలను సంధించేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమిదే. 
 
 వివరాల్లోకెళితే- ‘‘సూర్య కథానాయకునిగా లింగుస్వామి ‘అంజాన్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయిక సమంత. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని నిర్మాతలు మీడియాకు విడుదల చేశారు. కేవలం సూర్య మాత్రమే ఆ పోస్టర్‌లో ఉండటం సమంతకు ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది! ఇక ఆలస్యం చేయకుండా ట్విట్టర్ ఎక్కేసింది. ‘‘ఈ ఫీల్డ్‌లో హీరోలదే డామినేషన్. దానికి సూర్య కూడా అతీతుడు కాడని తేలిపోయింది. స్త్రీలకు సినీ పరిశ్రమలో సమగౌరవం లభిస్తుందనడం అసత్యం. ‘ఆంజాన్’ చిత్రం ఫస్ట్‌లుక్‌లో నా ఫొటో లేకపోవడమే ఆందుకు పెద్ద నిదర్శనం’’అని ట్విట్ చేసింది. నిజానికి సినిమా ఫస్ట్‌లుక్‌గా హీరో స్టిల్ విడుదల చేయడం కొత్తేం కాదు. సమంత ఆ విషయాన్ని కూడా విస్మరించి ఇలా వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement